ఏపీ కరోనా అప్ డేట్స్: కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు, 57 మంది మృత్యువాత

20-09-2020 Sun 17:44
AP Corona Virus spreading updates
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • 6.25 లక్షలు దాటిన ఏపీ కరోనా కేసులు
  • 5,359కి పెరిగిన మరణాలు

ఏపీలో కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విలయం సృష్టిస్తున్న ఈ మహమ్మారి అంతకంతకు వ్యాపిస్తోంది. తాజాగా ఏపీలో 7,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 57 మరణాలు సంభవించాయి.

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,514కి చేరగా, మరణాల సంఖ్య 5,359కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,836 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి విముక్తులైన వారి సంఖ్య 5,41,319గా నమోదైంది. గడచిన 24 గంటల్లో 10,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు.