బిగ్ బాస్-4లో నేడు ఫేక్ ఎలిమినేషన్..?

20-09-2020 Sun 15:55
Is there a fake elimination in Bigg Boss season four
  • ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగ్
  • ఇప్పటికే కరాటే కల్యాణి ఎలిమినేషన్
  • దేత్తడి హారిక ను ఫేక్ ఎలిమినేషన్ చేస్తారంటూ లీకులు!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇటీవల సీజన్ 4 ప్రారంభమైంది. గతవారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అందులో భాగంగా మొదట కరాటే కల్యాణిని ఎలిమినేట్ చేశారు. ఇక రెండో ఎలిమినేషన్ ఇవాళ ప్రకటించనున్నారు.

అయితే, ఈ రెండో ఎలిమినేషన్ ఫేక్ ఎలిమినేషన్ అంటూ లీకు మహారాజులు ప్రచారం చేస్తున్నారు. దేత్తడి హారికను ఎలిమినేషన్ పేరిట హౌస్ నుంచి బయటకు రప్పించి, ఆమెను సీక్రెట్ రూమ్ కు పంపిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఇదే తరహాలో ఫేక్ ఎలిమినేషన్ పేరిట కొన్నిరోజుల పాటు హౌస్ కు దూరంగా ఉంచారు. ఈసారి దేత్తడి హారిక అంశంలో సేమ్ ప్లాన్ అమలు చేయాలని బిగ్ బాస్ ఆలోచిస్తున్నాడట.

అటు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినా బిగ్ బాస్ ఇంట్లో తనదైన ముద్ర వేయలేకపోయిన యువ నటుడు కుమార్ సాయి ఈ వారం ఎలిమినేట్ అయ్యే రెండో కంటెస్టెంట్ అని మరో లీక్ చెబుతోంది. ఈ రెండింటిలో ఏది కరెక్టో తెలియాలంటే బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ కోసం ఎదరుచూడక తప్పదు!