తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

20-09-2020 Sun 10:08
2137 cases in Telangana registered yesterday
  • జీహెచ్ఎంసీ పరిధిలో 322 కేసులు
  • అత్యల్పంగా నారాయణపేటలో 9 కేసుల నమోదు
  • 1033కు పెరిగిన మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న కొత్తగా 2,137 కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితం బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 8 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తాజా కేసులు, మరణాలతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,71,306 కేసులు, 1033 మరణాలు నమోదయ్యాయి. అలాగే, నిన్న ఒక్క రోజే 53,811 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల సంఖ్య 24,88,220కి పెరిగింది.

కరోనా కోరల నుంచి నిన్న 2,192 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,39,700కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 30,573 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 24,019 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ (322) పరిధిలో వెలుగుచూశాయి. అత్యల్పంగా నారాయణపేటలో 9 కేసులు నమోదయ్యాయి.