Bhadradri Kothagudem District: భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిపై మందుపాతరలు అమర్చిన మావోలు

 Maoists planting mines on the Bhadrachalam Charla main road
  • కలివేరు-తేగడ గ్రామాల మధ్య మూడు మందుపాతరలు
  • నిర్వీర్యం చేసిన పోలీసులు
  • గంటన్నర పాటు నిలిచిపోయిన రాకపోకలు

రోడ్డు తనిఖీల్లో భాగంగా రోడ్డు పక్కన మావోయిస్టులు పాతిపెట్టిన మూడు మందు పాతరలను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలివేరు-తేగడ గ్రామాల మధ్య మావోయిస్టులు వీటిని ఏర్పాటు చేశారు. మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేయడంలో భాగంగా తేగడ క్రాస్‌రోడ్, కలివేరు గ్రామాల మధ్య గంటన్నరపాటు పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.

మందుపాతరలను తొలగించిన అనంతరం పోలీసు, బాంబ్ స్క్వాడ్ బృందాలు వాటిని సమీపంలో పేల్చివేశాయి. రేపటి నుంచి ఈ నెల 27 వరకు మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్న సందర్భంగానే వీటిని ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News