సంక్రాంతి పండగ రేసులోకి చేరిన బాలయ్య సినిమా!

19-09-2020 Sat 21:13
Balakrishna movie to be released for Pongal festival
  • సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల సందడి!
  • బాలయ్య, బోయపాటి సినిమా కూడా అప్పుడే!
  • త్వరలో హైదరాబాదులో షూటింగ్ మొదలు
  • సింగిల్ షెడ్యూలులో పూర్తిచేసే ప్లానింగ్     

తెలుగు సినిమాకి, సంక్రాంతికి వున్న సంబంధం విడదీయరానిది. ఎప్పటి నుంచో సంక్రాంతికి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుండడం మనం చూస్తున్నాం. అసలు సంక్రాంతికి తమ సినిమా విడుదల ఉండడాన్ని స్టార్ హీరోలు ప్రెస్టేజ్ గా కూడా ఫీలవుతారు. అందుకే, ఆ సమయానికి రిలీజ్ అయ్యేలా తమ తమ చిత్రాలను ప్లాన్ చేసుకుంటారు.

ఈ ఏడాది లాక్ డౌన్ కారణంగా పలు చిత్రాల నిర్మాణంలో జాప్యం జరగడం.. మరోపక్క థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ చేసే అవకాశాలు కనిపించకపోవడం కారణంగా ఆయా స్టార్ హీరోలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతి రేసులో బాలకృష్ణ కూడా చేరుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, తదుపరి షూటింగును మరో వారం రోజుల్లో హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షూటింగును సింగిల్ షెడ్యూలులో నిర్వహించి మొత్తం పూర్తి చేసేస్తారని సమాచారం. బోయపాటి, బాలయ్య కలయికలో వస్తున్న ఈ మూడో చిత్రంలో అంజలి కథానాయికగా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయదశమికి ఈ చిత్రం టైటిల్ని ప్రకటించే అవకాశం వుంది.