2000 note: రూ. 2 వేల నోటుపై వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

2000 note printing not stopped says Centre
  • 2 వేల నోటు ప్రింటింగ్ ఆపేయడం లేదు
  • లాక్ డౌన్ కారణంగా తాత్కాలికంగా ముద్రణ నిలిచిపోయింది
  • తాజాగా ప్రింటింగ్ మళ్లీ ప్రారంభమైంది
రూ. 2 వేల నోటు ప్రింటింగ్ ను నిలిపేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై లోక్ సభలో ఓ ప్రశ్నకు బదులుగా ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2 వేల నోటు ముద్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఆర్బీఐని సంప్రదించి కేంద్రం సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని  తెలిపారు. లాక్ డౌన్ కారణంగా నోట్ల ముద్రణ తాత్కాలికంగా నిలిచి పోయినట్టు ఆర్బీఐ తెలిపిందని చెప్పారు. అయితే కేంద్ర, రాష్ట ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణం నోట్ల ముద్రణ మళ్లీ ప్రారంభమైందని తెలిపారు.
2000 note
Printing
Centre

More Telugu News