చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన కంగనాకు జరిమానా విధించండి: హైకోర్టుకి బీఎంసీ విజ్ఞప్తి

19-09-2020 Sat 20:18
BMC requests HC to fine Kangana Ranaut
  • కంగన కార్యాలయాన్ని కూల్చిన బీఎంసీ అధికారులు
  • పరిహారం చెల్లించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన కంగన
  • కంగన పిటిషన్ ను కొట్టేయాలన్న బీఎంసీ

మహారాష్ట్ర ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణమంటూ బీఎంసీ అధికారులు ఆఫీసు గోడలను కూల్చేసిన సంగతి తెలిసిందే.

దీంతో, బాంబే హైకోర్టులో కంగన పిటిషన్ వేసింది. తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని తన పిటిషన్ లో కోరింది.

అయితే కంగన వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని హైకోర్టును బీఎంసీ కోరింది. చట్టపరంగా చేసిన చర్యను తప్పుపడుతూ పిటిషన్ వేయడం తప్పని పేర్కొంది. అంతేకాదు చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసినందుకు కంగనాకు జరిమానా విధించాలని కోరింది.