వాసుపల్లి రాకతో పార్టీ బలం పెరిగింది: విజయసాయిరెడ్డి

19-09-2020 Sat 19:10
YSRCP strength increased with the joining of Vasupalli says Vijayasai Reddy
  • వైసీపీకి దగ్గరైన వాసుపల్లి గణేశ్
  • వాసుపల్లి కుటుంబం విశాఖకు ఎంతో సేవ చేస్తోందన్న విజయసాయి
  • విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్య

విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఈరోజు తన కుమారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా గణేశ్ కుమారులు వైసీపీలో చేరారు. వారిద్దరికీ జగన్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, సాంకేతిక కారణాలతో గణేశ్ మాత్రం పార్టీ కండువా కప్పుకోలేదు. వైసీపీలో వీరి చేరిక అనంతరం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాసుపల్లి గణేశ్ కుటుంబం విశాఖకు ఎంతో సేవ చేస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. వారు రావడంతో పార్టీకి ఎంతో బలం వచ్చిందని చెప్పారు. విశాఖ జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉన్నా, లేకున్నా ఒకటేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని, ఇక ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటాడని ఎద్దేవా చేశారు.