ఐదు నెలల ప్రెగ్నెన్సీతోనే ఐపీఎల్ యాంకరింగ్ చేద్దామనుకున్నా: మాయంతి లాంగర్

19-09-2020 Sat 17:02
Iam going to love watching IPL says Mayanti Langer
  • ఇటీవలే పండంటి కొడుక్కి జన్మనిచ్చిన మాయంతి 
  • జీవితం కొత్తగా ఉందంటూ ట్వీట్
  • కొడుకు, భర్తతో మధుర క్షణాలను అనుభవిస్తున్నానని వ్యాఖ్య

ఐపీఎల్ యాంకర్ గా మాయంతి లాంగర్ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమెను అభిమానించేవారు ఎందరో ఉన్నారు. ప్రముఖ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్యే మాయంతి అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆరు వారాల క్రితమే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా భర్త, కుమారుడితో కలసి దిగిన ఫొటోను ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

'గత ఐదేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ తన కుటుంబంలో ఒకరిగా నన్ను చూసింది. వారు నిర్వహించిన అనేక గొప్ప కార్యక్రమాల్లో నన్ను భాగస్వామిగా చేశారు. నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహించాను. కరోనా లేకపోయినట్టైతే, మార్చిలో ఐపీఎల్ జరిగి ఉంటే... ఐదు నెలల ప్రెగ్నెన్సీతో యాంకరింగ్ చేద్దామనుకున్నాను. ఆరు వారాల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చా. బాబు, స్టువర్ట్ తో కలిసి మధుర క్షణాలను అనుభవిస్తున్నా. మా జీవితంలోకి బాబు ప్రవేశించాక చాలా కొత్తగా ఉంది. ఈసారి ఐపీఎల్ ను టీవీలో చూసి ఎంజాయ్ చేస్తా' అని మాయంతి తెలిపింది.