సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్.. వైసీపీలో కుమారుల చేరిక!

19-09-2020 Sat 16:21
TDP MLA Vasupalli Ganesh met CM Jagan along with his sons
  • వైసీపీ కండువాలు కప్పుకున్న వాసుపల్లి తనయులు
  • వైసీపీకి మద్దతు పలికిన వాసుపల్లి గణేశ్!
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ

అధికార వైసీపీలోకి టీడీపీ నుంచి కొంతకాలంగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, విశాఖ (దక్షిణం) టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన కుమారులతో కలిసి సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. సీఎం జగన్ ను కలిసిన వాసుపల్లి గణేశ్ వైసీపీకి మద్దతు పలికారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

 ఈ సందర్భంగా వాసుపల్లి తనయులు సూర్య, గోవింద్ సాకేత్ ఇద్దరూ వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సమయంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.