కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభం.. ఏయే చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతుందంటే?

19-09-2020 Sat 15:46
Details of Channels live telecasting IPL 2020
  • సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానున్న తొలి మ్యాచ్
  • అబుదాబిలో ముంబై, చెన్నైల మధ్య మ్యాచ్
  • తెలుగులో 'మా మూవీస్'లో ప్రత్యక్ష ప్రసారం

యావత్ ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసిరిన తర్వాత... ఒక  మెగా క్రికెట్ టోర్నీకి ఈరోజు తెరలేస్తోంది. కాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభంకానుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ మన దేశంలో కాకుండా యూఏఈలో జరుగుతోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లు ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి మ్యాచ్ అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ లైవ్ టెలికాస్ట్ ఏయే చానళ్లలో రానుందో తెలుసుకుందాం.

ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరప్, మలేసియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, సెంట్రల్ ఆసియా, సింగపూర్ మినహాయించి సౌత్ ఈస్ట్ ఆసియా,  సెంట్రల్ మరియు సౌత్ అమెరికా దేశాలలో యప్ టీవీ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది.

ఇంగ్లీష్ టెలికాస్ట్:
స్టార్ స్పోర్ట్స్ 1
స్టార్ స్పోర్ట్స్ 2
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2

హిందీ:
స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ
డీడీ నేషనల్

తెలుగు:
మా మూవీస్

ఆన్ లైన్ బ్రాడ్ కాస్టింగ్ (ఓటీటీ ప్లాట్ ఫామ్):
హాట్ స్టార్
జియో టీవీ
రెడ్ బాక్స్ టీవీ.