కర్ణాటకలోని ప్రసిద్ధ ఆలయంలో రాజమౌళి దంపతుల ప్రత్యేక పూజలు... ఫొటోలు ఇవిగో!

19-09-2020 Sat 15:45
Rajamouli visits Himavad Gopalaswamy temple in Karnataka along with his wife Rama
  • కర్ణాటకలో పర్యటిస్తున్న రాజమౌళి
  • ప్రాచీన ఆలయాన్ని సందర్శించిన వైనం
  • ఆర్ఆర్ఆర్ లొకేషన్ల వేట అంటూ కథనాలు

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో హిమవద్ గోపాలస్వామి ఆలయం ఎంతో ప్రశస్తమైనది. ఈ ప్రాచీన ఆలయాన్ని టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి సతీసమేతంగా దర్శించారు. ఈ ఆలయంలో రాజమౌళి, ఆయన అర్ధాంగి రమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వర్గాలు రాజమౌళి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశాయి.

కాగా, దర్శకుడు రాజమౌళి గత కొన్నిరోజులుగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. మైసూర్, కొడుగు వంటి పర్యాటక ప్రదేశాలను ఆయన సందర్శించారు. అంతేకాదు, రాజమౌళి, రమ కర్ణాటకలోని ఫేమస్ బందిపూర్ అభయారణ్యంలోనూ పర్యటించగా, అక్కడ వీరిని పలువురు తమ కెమెరాల్లో బంధించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా, రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం లొకేషన్ల వేట సాగిస్తున్నారంటూ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి.