ఇచ్చిన మాట నిలబెట్టుకుని.. 'సేవ భవన' నిర్మాణం పూర్తి చేయించిన మెగా హీరో సాయితేజ్

19-09-2020 Sat 11:22
IamSaiDharamTej  fulfills his promise
  • విజయవాడలోని `అమ్మ ప్రేమ ఆదరణ సేవ` భవన మరమ్మతులు
  • వసతుల విషయంలో గతంలో మాట ఇచ్చిన హీరో    
  • మెగా ఫ్యాన్స్‌ కూడా సాయం

విజయవాడలోని `అమ్మ ప్రేమ ఆదరణ సేవ` భవనం మరమ్మతులు, వసతుల విషయంలో గతంలో మెగా హీరో సాయితేజ్‌ ఇచ్చిన మాటను నిలబెట్టకున్నాడు. భవనానికి మరమ్మతులు చేయించాడు.

2019లో తన జన్మదినోత్సవం సందర్భంగా సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసి, ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సంప్రదించి, భవన నిర్మాణానికి సాయం చేయాల్సిందిగా కోరారని, అందుకు తాను అంగీకరించానని తెలిపాడు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యాన్స్ కూడా కొంత సాయం చేశారు. చివరకు సాయితేజ్ ఆ భవన నిర్మాణం పూర్తి చేయించాడు.