America: ఏప్రిల్ నాటికి దేశంలోని అందరికీ సరిపడా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్

Donald Trump says vaccine will availble by next year april
  • వ్యాక్సిన్‌కు అనుమతి లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభం
  • టీకా అందుబాటులోకి వస్తేనే దేశంలో సాధారణ పరిస్థితులు
  • మూడు వ్యాక్సిన్లకు తుది దశ క్లినికల్ పరీక్షలు
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అమెరికా పౌరులందరికీ సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌కు అనుమతులు లభించిన వెంటనే దేశంలోని పౌరులందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తామని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందరికీ సరిపడా డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు.

దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే అందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న ట్రంప్.. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైనట్టు చెప్పారు. టీకా కనుక అందుబాటులోకి వస్తే ప్రజల ప్రాణాలకు ఉన్న ముప్పు తొలగిపోవడమే కాకుండా, అనేక రకాల ఆంక్షల నుంచి విముక్తి లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
America
corona vaccine
Donald Trump

More Telugu News