కంగన టార్గెట్ గా... సన్నీ లియోన్ వ్యంగ్య కామెంట్!

19-09-2020 Sat 09:26
Sunny Leone cryptic post on Kangana Ranaut
  • ఊర్మిళతో కంగనా రనౌత్ వివాదం
  • అడల్ట్ స్టార్ ను ఆదరించామని మరో వ్యాఖ్య
  • తీవ్రంగా మండిపడిన సన్నీ

సినీ నటిగా పాప్యులర్ అయి, ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్న ఊర్మిళా మంతోండ్కర్ తో వివాదానికి దిగిన కంగన, తన పేరును దానిలోకి లాగడంపై సన్నీ లియోన్ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో నర్మగర్భంగా అనీ అనకుండానే అనేసినట్టుగా ఓ పోస్ట్ ను పెట్టింది.

కాగా, తొలుత ఊర్మిళను ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ గా అభివర్ణించిన కంగన, ఆపై, తానేమీ తప్పుగా విమర్శించలేదని, భారత సినీ పరిశ్రమ సన్నీ లియాన్ వంటి అడల్ట్ స్టార్ ను కూడా స్వాగతించిందని వ్యాఖ్యానించింది. ఇక, ఈ కామెంట్లను చూసిన సన్నీ లియాన్, తన ఇన్ స్టాగ్రామ్ లో "నీ గురించి ఎంతో తక్కువ తెలిసిన వాళ్లు, ఎంతో ఎక్కువ మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది" అని కామెంట్ చేసింది. ఇక, ఈ పోస్ట్ వైరల్ కాగా, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. సన్నీ సరిగ్గా మాట్లాడిందని కామెంట్లు వెల్లువెత్తాయి.