Nawaz sharif: లండన్‌లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. అరెస్ట్‌ వారెంట్ జారీ చేసిన పాక్

Pak Government Sends Arrest Warrants For Nawaz Sharif
  • అవెన్ ఫీల్డ్, అల్ అజీజియా స్టీల్ మిల్లు కేసుల్లో ఏడేళ్ల జైలు శిక్ష
  • అనారోగ్యంతో బెయిలుపై లండన్ వెళ్లిన నవాజ్
  • 8 వారాల గడువు ముగిసినా తిరిగి రాని షరీఫ్
లండన్‌లో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (70) అరెస్ట్‌కు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అవెన్ ఫీల్డ్ ఆస్తులు, అల్ అజీజియా స్టీల్ మిల్లు కేసుల్లో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్‌కు డిసెంబరు 2018లో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే, ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు బెయిలిచ్చిన లాహోర్ కోర్టు వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు గతేడాది నవంబరులో అనుమతించింది. అయితే, 8 వారాల్లో తిరిగి రావాలని ఆదేశించినప్పటికీ అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తిరిగి స్వదేశం రాలేకపోయినట్టు నవాజ్ న్యాయవాది తెలిపారు.

దీంతో నవాజ్‌ను అరెస్ట్ చేసేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా లండన్‌లో ఉంటున్న షరీఫ్‌ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది. షరీఫ్ అరెస్ట్ వారెంట్ అందినట్టు లండన్‌లోని పాక్ హైకమిషన్ వెల్లడించింది.
Nawaz sharif
Pakistan
London
Arrest

More Telugu News