ఫోన్ లో సీఐపై రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి?... కాల్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్!

19-09-2020 Sat 08:07
Viral Audioo of YSRCP MLA Sridevi Angry Over CI
  • సీఐతో ఉండవల్లి శ్రీదేవి వాగ్వాదం
  • తన వారిని వదలట్లేదని ఆగ్రహం
  • డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తుళ్లూరు  సీఐని దుర్భాషలాడినట్టు చెప్పబడుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నీకేమైనా మెంటలా..." అంటూ... పోలీసు అధికారని కూడా చూడకుండా మాట్లాడారు. 'ఎప్పటి నుంచి చెబుతున్నాను? వాళ్లను పంపేయొచ్చుగా? వాళ్లను పట్టుకున్న రోజునే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్? నేనంటే గౌరవం లేదా?' అంటూ రెచ్చిపోయారు.

'అందరినీ వదులుతున్నావు, నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావు, రెండు నిమిషాల్లో వెళ్లిపోతావు. ఎస్పీకి, డీజీపీకి చెబుతా' అంటూ హెచ్చరించారు. కాగా, అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నందుకు, వారిని వదిలి పెట్టాలంటూ శ్రీదేవి ఇలా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియోను మీరూ వినవచ్చు.