మాదాపూర్ డీఎస్ఐని కబళించిన కరోనా

19-09-2020 Sat 07:57
Madhapur DSI Died with Corona virus
  • పది రోజుల క్రితం ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన అబ్బాస్ అలీ
  • పరిస్థితి విషమించడంతో నిన్న ఉదయం కన్నుమూత
  • పోలీసుల సంతాపం

హైదరాబాద్‌లో కరోనాకు మరో పోలీసు అధికారి బలయ్యారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్ఐగా పనిచేస్తున్న 56 ఏళ్ల అబ్బాస్ అలీ కరోనాతో కన్నుమూశారు.

బోరబండలో నివసిస్తున్న ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. పది రోజుల క్రితం మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న ఉదయం కన్నుమూశారు. అబ్బాస్ అలీ మృతికి పోలీసులు సంతాపం తెలిపారు.