సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

19-09-2020 Sat 07:21
Ada Sharma dubs herself in her latest flick
  • డబ్బింగ్ చెప్పుకుంటున్న మరో హీరోయిన్
  • కమలహాసన్ సినిమాలో మరో హీరో
  • రిలీజ్ డేట్ వెల్లడించిన అఖిల్ అక్కినేని

*  కథానాయిక ఆదాశర్మ కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. తాజాగా ఆమె విప్రా దర్శకత్వంలో రూపొందుతున్న '?' (క్వశ్చన్ మార్క్) చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నానని ఆదాశర్మ పేర్కొంది. కాగా, ఈ  చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను నిన్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రిలీజ్ చేశారు.
*  ఆమధ్య కార్తీతో 'ఖైదీ' చిత్రాన్ని తీసి, మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్ ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడట.
*  అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని జనవరి 21న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయించారని హీరో అఖిల్ తాజాగా వెల్లడించాడు.