ధోనీలో వేగం ఏమాత్రం తగ్గలేదు.. మరికొన్ని గంటల్లోనే అది అందరికీ తెలుస్తుంది: సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్

19-09-2020 Sat 06:28
Will All See that No Change in Dhoni Today
  • ముంబై ఇండియన్స్ కు పెను సవాలే
  • ధోనీలో మునుపటి వేగం తగ్గలేదు
  • అతని సత్తా ఏంటో ప్రతి ఒక్కరూ చూస్తారన్న ఫ్లెమింగ్

ఐదోసారి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్న ముంబై ఇండియన్స్ కు.. నాలుగోసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ సేన పెను సవాల్ ను విసరనుందని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు. తమ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటలో ఎటువంటి మార్పూ లేదని, మరికొన్ని గంటల్లో ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుందని అన్నారు.

ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ ఎంతో విభిన్నమైనదని వ్యాఖ్యానించిన ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, వచ్చే 53 రోజుల్లో పెద్ద పెద్ద మ్యాచ్ లను అభిమానులు వీక్షించనున్నారని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా, ధోనీలో ఏ మాత్రమూ మునుపటి వేగం తగ్గలేదని అన్నారు.