Santosh Kumar: తన పర్యావరణ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్

TRS MP Santosh Kumar has taken his Green India Challenge to Delhi
  • అశోక మొక్క నాటిన కేంద్రమంత్రి రూపాల
  • సంతోష్ కుమార్ కు అభినందనలు
  • ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ వ్యాఖ్యలు
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఈ చాలెంజ్ లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పరుషోత్తమ్ రూపాల ఢిల్లీలోని తన నివాసంలో అశోక మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు.

ఓ యువ ఎంపీ పర్యావరణ హిత ఉద్యమం చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అని, ఈ చాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేలా భగవంతుడు సంతోష్ కుమార్ కు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. తన సహచర మంత్రులు కూడా ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములు అయ్యేట్టు ప్రోత్సహిస్తానని రూపాల వెల్లడించారు. మొక్క నాటడమే కాకుండా వాటి రక్షణ బాధ్యతలు కూడా చూసుకోవాలని తెలిపారు.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ హరితహారంతో పాటు తన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. అనేక పార్టీల సభ్యులను కలిసి వారిలో అవగాహన కల్పిస్తున్నారు.
Santosh Kumar
Green India Challenge
New Delhi
Parshottam Rupala
TRS

More Telugu News