Anushka Shetty: ఓటీటీ ద్వారా అనుష్క 'నిశ్శబ్దం'.. డేట్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్!

Amezon Prime announces premier date of Anushka movie
  • ఏప్రిల్ లో విడుదలవ్వాల్సిన 'నిశ్శబ్దం'
  • థియేటర్లు మూతబడడంతో నిలిచిన రిలీజ్ 
  • అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్  
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాలలో అనుష్క సినిమా కూడా వుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా కోన వెంకట్ నిర్మించిన 'నిశ్శబ్దం' చిత్రం వాస్తవానికి గత ఏప్రిల్ నెలలోనే విడుదలవాలి. అయితే, కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ పడడంతో థియేటర్లన్నీ మూతబడడంతో చిత్రం విడుదల ఆగిపోయింది.

ఆ తర్వాత ఓటీటీ ప్లేయర్స్ నుంచి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఈ చిత్రానికి మంచి ఆఫర్లు వచ్చాయి. నిర్మాతలు కూడా కమిట్ అవడానికి రెడీ అయ్యారని, అయితే, థియేటర్లలోనే రిలీజ్ చేయాలంటూ అనుష్క అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగిపోయారంటూ వార్తలొచ్చాయి. త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయి, రిలీజ్ చేద్దాం అన్నట్టుగా ఎదురుచూశారు.

అయితే, ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం సాధ్యం కాదని ఇప్పుడు తేలిపోవడంతో నిర్మాతలు ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి స్ట్రీమింగ్ కోసం ఇచ్చేసినట్టు ప్రచారం జరిగింది. దానిని ధ్రువీకరిస్తూ సదరు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతో ఈ చిత్రం విడుదలపై నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయినట్టే!  
Anushka Shetty
Kona Venkat
Hemanth Madhukar

More Telugu News