Nara Brahmani: హెరిటేజ్ కోసం.. ఆన్ లైన్ లో కొత్త యాప్ తీసుకువచ్చిన నారా బ్రాహ్మణి

  • హెరిటేజ్ టచ్ యాప్ ఆవిష్కరణ
  • కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి, భువనేశ్వరి
  • ఎంతో సంతోషంగా ఉందన్న బ్రాహ్మణి
Nara Brahmani launches Heritage Touch app

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఆన్ లైన్ లో సరికొత్త యాప్ ను తీసుకువచ్చారు. ఈ యాప్ పేరు హెరిటేజ్ టచ్. తన అత్తగారైన నారా భువనేశ్వరితో కలిసి బ్రాహ్మణి ఇవాళ హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో యాప్ ను ఆవిష్కరించారు.

ఈ యాప్ సాయంతో వినియోగదారులు ఆన్ లైన్ లోనే హెరిటేజ్ పాలు, పాల పదార్థాలు కొనుగోలు చేయవచ్చు. కరోనా నేపథ్యంలో ప్రజల దృష్టి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడంపైకి మళ్లిన క్రమంలో, హెరిటేజ్ ఫుడ్స్ తులసి, పసుపు, అల్లం కలయికతో రోగ నిరోధకశక్తిని పెంచే పాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

యాప్ ను లాంచ్ చేసిన సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండేలా హెరిటేజ్ టచ్ యాప్ తీసుకురావడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడూ వినియోగదారుల ఆరోగ్యం, సంతోషాన్నే కోరుకుంటుందని తెలిపారు. ఇమ్యూనిటీ పెంచే పాల ఉత్పత్తుల తయారీలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News