Pit Viper: ఈ నీలి రంగు సర్పం ఎంత అందమైనదో.. అంతకంటే ప్రమాదకరమైంది!

  • సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న బ్లూ కలర్ పాము
  • ఇది పిట్ వైపర్ ఉపజాతిగా పేర్కొన్న మాస్కో జూ
  • పాము వీడియో వైరల్
Blue colour pit viper attracts attentions on social media

ఎర్ర గులాబీపై చుట్టుకుని పడుకున్న నీలి రంగు పాము... ఇప్పుడీ ఫొటో ఇంటర్నెట్ లో విపరీతమైన సందడి చేస్తోంది. ఇది ఎంతో అరుదైన పాము కావడమే నెటిజన్ల ఆసక్తికి కారణం. బ్లూ కలర్ లో కనిపించే ఈ పామును బ్లూ పిట్ వైపర్ అంటారు. చూడ్డానికి ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందో అంతకంటే ప్రమాదకరమైనది. దీని విషం మనిషి ప్రాణాలను హరించివేయగల శక్తిమంతమైంది. ఇది కాటు వేసిందంటే రక్తం కక్కుకుని మరణిస్తారు. అంతర్గత రక్తస్రావంతో పాటు, శరీరంపైనా స్వేద రంధ్రాల్లోంచి రక్తస్రావం జరుగుతుంది.

ఈ పాము పిట్ వైపర్ ఉప జాతికి చెందినదని, ప్రధానంగా ఇది ఇండోనేషియా, తూర్పు తైమూర్ ప్రాంతాల్లో ఉంటుందని మాస్కో జూ తెలిపింది. ఇవి హరిత వర్ణంలోనూ, నీలి రంగులోనూ ఉంటాయని వివరించింది. కాగా, ఈ పాముకు సంబంధించిన వీడియోను లైఫ్ ఆన్ ఎర్త్ అనే సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


More Telugu News