Chevireddy Bhaskar Reddy: జంద్యం వేసుకోని బ్రాహ్మణుడు వైవీ సుబ్బారెడ్డి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

  • వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి దైవ భక్తి ఎక్కువ
  • దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవారు దరిద్రులు
  • శ్రీవారిని దర్శనం చేసుకుని జగన్ పాదయాత్రను ప్రారంభించారు
Chevireddy praises YV Subba Reddy

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, ఆయన కుటుంబానికి దైవ భక్తి ఎక్కువని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న భక్తిలో 10 శాతం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలో ఉండదని ఎద్దేవా చేశారు. జంద్యం వేసుకోని బ్రాహ్మణుడు వైవీ సుబ్బారెడ్డి అని కొనియాడారు.

దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునేవారంతా దరిద్రులేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ నాయకుడు కూడా దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయకూడదని అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని జగన్ పాదయాత్రను ప్రారంభించారని... పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు.

మరోవైపు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో దళారీ వ్యవస్థను, అవినీతిని పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. పూర్తి పారదర్శకత కోసం టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. టీటీడీ డైరీల సంఖ్యను తగ్గించామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని... కరోనా నేపథ్యంలో డైరీల ముద్రణను 25 శాతం తగ్గించామని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినంత అవినీతి చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి ఆరోపణల్లో వాస్తవాలు లేవని అన్నారు.

More Telugu News