ఏపీలో కరోనాతో మరో 67 మంది మృతి.. తాజా అప్ డేట్స్!

18-09-2020 Fri 16:58
67 dead with Corona in last 24 hours in AP
  • 24 గంటల్లో కొత్తగా 8,096 కేసుల నమోదు
  • 74,710 మందికి కోవిడ్ టెస్టులు
  • రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో తాజాగా మరో 8,096 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,09,558కి చేరుకుంది. 24 గంటల్లో 74,710 మందికి టెస్టులు నిర్వహించారు. మరోవైపు ఇదే సమయంలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,244కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,19,891 మంది డిశ్చార్జ్ అయ్యారు.