సూపర్ స్టార్ కి విలన్ గా బాలీవుడ్ నటుడు!

18-09-2020 Fri 16:45
Jockie Shraf plays villain to Rajanikanth
  • శివ దర్శకత్వంలో రజనీకాంత్ 'అన్నాత్తే'
  • విలన్ పాత్రకు జాకీ ష్రాఫ్ ఎంపిక
  • రజనీ సరసన నయనతార, కీర్తి సురేశ్ 
  • మిగిలివున్న షూటింగ్ త్వరలో సెట్స్ లో 

సినిమాకి హీరో ఎంతో విలన్ కూడా అంతే. విలన్ సమ ఉజ్జీ అయినప్పుడే హీరోయిజం కూడా ఎలివేట్ అవుతుంది. అందుకే, విలన్ పాత్రలకు మన దర్శక నిర్మాతలు పవర్ ఫుల్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దించుతుంటారు. అందులోనూ రజనీకాంత్ లాంటి మాస్ ఇమేజ్ అధికంగా వుండే స్టార్ హీరోలకైతే మరీనూ. ఆకారంలో కానీ, అభినయంలో కానీ మంచి పవర్ ఫుల్ నటుడు వుండి తీరాల్సిందే.

ఇక విషయానికి వస్తే, తాజాగా రజనీకాంత్ తమిళంలో 'అన్నాత్తే' సినిమాలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. ఇది పవర్ ఫుల్ పాత్ర కావడంతో జాకీని తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇన్నాళ్లూ  ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

ఈ చిత్రం షూటింగ్ చాలావరకు లాక్ డౌన్ కి ముందే జరిగింది. అయితే, ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. దీనిని మరికొన్నాళ్లలో చెన్నైలో సెట్స్ లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నప్పటికీ, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇందులో రజనీ సరసన ఖుష్బూ, మీనాలతో పాటు నయనతార, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.