ప్రేమతో కూడిన మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు సార్: మోదీకి కోహ్లీ రిప్లై

18-09-2020 Fri 14:31
Virat Kohli Thanks PM Narendra Modi
  • మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కోహ్లీ
  • తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో కోహ్లీ దంపతులకు మోదీ గ్రీటింగ్స్
  • మంచి తల్లిదండ్రులు అవుతారని ఆకాంక్ష

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాని మోదీ నిన్న పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా మోదీకి విరాట్ కోహ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సందర్భంగా మోదీ స్పందిస్తూ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మీరిద్దరూ గొప్ప తల్లిదండ్రులు అవుతారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ ప్రధానికి థ్యాంక్స్ చెప్పాడు. 'ప్రేమతో కూడిన మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు సార్' అని ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చాడు.