Kathi Karthika: దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన కత్తి కార్తీక... సజీవదహనం చేస్తామంటూ దుండగుల బెదిరింపులు!

Kathi Karthika complains to police on threatens
  • కార్తీక కారు డ్రైవర్ ను అడ్డగించిన దుండగులు
  • కార్తీకను పోటీ చేయొద్దని చెప్పాలంటూ హెచ్చరికలు
  • రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్తీక
త్వరలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక దుబ్బాక ఉప ఎన్నిక బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే ఆమెకు తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. కార్తీక డ్రైవర్ ఇజాజ్ షరీఫ్ ను కొందరు వ్యక్తులు బెదిరించారు. కార్తీక దుబ్బాకలో పోటీ చేస్తే ఆమెను సజీవదహనం చేస్తామంటూ వారు హెచ్చరించారు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కార్తీక రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన కారు డ్రైవర్ ఇజాజ్ షరీఫ్ హైదరాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా, రామాయంపేట వద్ద గుర్తుతెలియని దుండగులు అటకాయించారని తెలిపారు. ఇన్నోవా వాహనంలో వచ్చిన ఆ వ్యక్తులు దుబ్బాకలో పోటీ చేయవద్దని తనకు చెప్పాలని తన డ్రైవర్ ను బెదిరించారని ఆరోపించారు.

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఓ మహిళను గౌరవించే విధానం ఇదేనా? అని కార్తీక ప్రశ్నించారు. కాగా, ఆమె ఫిర్యాదు నేపథ్యంలో రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.
Kathi Karthika
Police
Complaint
Threats
Dubbaka
Elections

More Telugu News