కండిషనల్ బెయిల్ మీద వచ్చి.. కోర్టులనే విమర్శిస్తున్నారు: వర్ల రామయ్య

18-09-2020 Fri 13:24
Vijayasai Reddys bail to be cancelled says Varla Ramaiah
  • న్యాయ వ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న విజయసాయి
  • సీబీఐ, ఈడీ కేసుల్లో విజయసాయి ప్రధాన ముద్దాయి అన్న వర్ల
  • బెయిల్ రద్దు చేయాలని వ్యాఖ్య

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కూడా అవే వ్యాఖ్యలు చేశారు.  

టీడీపీ నేత వర్ల రామయ్య ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 11 సీబీఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి విజయసాయి అని పేర్కొన్నారు. ఈ కేసుల్లో కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చిన విజయసాయి... ఏకంగా పార్లమెంటులో న్యాయ వ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు చేశారని... ఇలా వ్యవహరించినందుకు అత్యున్నత న్యాయస్థానం అతని బెయిల్ రద్దు చేసి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పొద్దూ అని అన్నారు.