ఏడేళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న లవర్ బోయ్!

18-09-2020 Fri 13:11
  • తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న సిద్ధార్థ్
  • 'మహాసముద్రం' సినిమా ద్వారా రీఎంట్రీ 
  • మరో హీరోగా నటిస్తున్న శర్వానంద్
Siddharth acting in Telugu movie after 7 years
సిద్ధార్థ్... తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. లవర్ బోయ్ గా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' తదితర ఎన్నో చిత్రాల్లో నటించి, మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులో ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో... గత ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. కొన్ని తమిళ అనువాద చిత్రాల్లో కనిపించినా... పెద్దగా హిట్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు.

'మహాసముద్రం' చిత్రంలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ నటించనున్నాడు. ఈ సినిమాకు ఆర్ఎక్స్100ని తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధార్థ్ కు సంబంధించి వీడియోను పోస్ట్ చేసింది.