Computers: నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కంప్యూటర్లు హ్యాక్... అందులో మోదీ, ధోవల్, దేశ భద్రతకు చెందిన సమాచారం!

  • ఎన్ఏసీ ఉద్యోగులకు ఈ-మెయిల్
  • తెరవగానే కంప్యూటర్లు హ్యాక్
  • యూఎస్ కు చెందిన బెంగళూరు ఆఫీస్ హ్యాక్ చేసినట్టు అనుమానం
  • కేసును విచారిస్తున్న ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్
Amid Having Crucial Deta NAC Computers Hacked

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సహా పలువురు ప్రముఖులు, దేశ భద్రతకు సంబంధించిన ఎంతో సమాచారం ఉన్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని వెల్లడించిన న్యూఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కేసు నమోదు చేశామని వెల్లడించారు.

ఈ హ్యాకింగ్ కు పాల్పడింది బెంగళూరులోని అమెరికాకు చెందిన ఓ కార్యాలయం అని ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. ఎన్ఐసీకి చెందిన ఉద్యోగులకు ఒక ఈ మెయిల్ వచ్చిందని, దాన్ని తెరచి, లింక్ ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ హ్యాక్ అయిందని తెలిపారు. ఈ హ్యాకింగ్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మోదీ సహా దాదాపు 10 వేల మంది ప్రముఖులపై చైనా గూఢచర్యం చేస్తోందని ఈ వారం ఆరంభంలో వచ్చిన వార్త తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో, ఇప్పుడీ కంప్యూటర్ల హ్యాక్ కలకలం సృష్టిస్తోంది.

More Telugu News