పుట్టిన రోజున నరేంద్రమోదీకి ట్విట్టర్ లో షాక్... నిలదీసిన ట్వీట్లే అధికం!

18-09-2020 Fri 11:35
  • నిన్న వైరల్ అయిన నిరుద్యోగ దినం హ్యాష్ ట్యాగ్
  • శుభాకాంక్షల కంటే అధికంగా నిలదీత ట్వీట్లు
  • కేంద్రాన్ని ప్రశ్నించిన 16 లక్షల మంది
Twitter Shocks Modi on his Birthday

గురువారం నాడు తన 70వ పుట్టిన రోజును జరుపుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టరాటీలు షాకిచ్చారు. ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తిన వేళ, నెటిజన్లు మాత్రం ఆయన్ను ప్రశ్నలతో ముంచెత్తారు. 'హ్యాపీ బర్త్ డే పీఎం మోదీ' హ్యాష్ ట్యాగ్ తో పోలిస్తే, 'నేషనల్ అన్ ఎంప్లాయిమెంట్ డే' (జాతీయ నిరుద్యోగ దినం) హ్యాష్ ట్యాగ్ తో అధిక ట్వీట్లు రావడం గమనార్హం.

ప్రధాని పుట్టిన రోజున సామాజిక మాధ్యమాల్లో నిరసనలు తెలియజేయాలని కొన్ని రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంపై ప్రశ్నలు శరపరంపరలుగా వచ్చాయి. మొత్తం 16 లక్షలకు పైగా ట్వీట్లు కేంద్రాన్ని నిలదీస్తూ వచ్చాయి.