Andhra Pradesh: 20న బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం... వర్షాలు ఇప్పట్లో తగ్గబోవంటున్న వాతావరణ శాఖ!

  • ఉపరితల ద్రోణితో ఇప్పటికే వర్షాలు
  • గత 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షం
  • మరో రెండు రోజులు వర్షాలు
Another Low Preasure in Bay of Bengal

ఈ నెల 20వ తేదీన, ఆదివారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు, కొత్త అల్పపీడనం కారణంగా ఏర్పడే పరిస్థితులు కలిసి, మరిన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినా, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో నిత్యమూ ఏదో ఒక సమయంలో భారీ వర్షం కాసేపు పలకరిస్తూనే ఉంది. ఇక రాగల 48 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

More Telugu News