మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు: నాగార్జున

17-09-2020 Thu 21:55
  • దుమ్మురేపుతోన్న బిగ్ బాస్ 4
  • టీఆర్పీలో కొత్త రికార్డులు
  • ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ షోకు కనెక్ట్ అయినట్టు ప్రకటన
Nagarjuna thanks audience for encouraging Big Boss
ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 రియాల్టీ షో దుమ్మురేపుతోంది. టీఆర్పీ రేటింగ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత బిగ్ బాస్ మూడు సీజన్ల కంటే ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని బిగ్ బాస్ టీమ్ ప్రకటించింది. తెలుగు ప్రేక్షకుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ షోకు కనెక్ట్ అయినట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీ అందిరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.