Nitya Menon: తెలుగు సినిమాకి పాట పాడిన నిత్యా మీనన్!

Nitya Menon sings for her telugu movie
  • సంగీతం పట్ల అభిరుచి వున్న నిత్యామీనన్ 
  • హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'నిన్నిలా నిన్నిలా'
  • త్వరలో ఆంగ్లంలో సింగిల్ రిలీజ్ చేయనున్న నిత్య
మన కథానాయికలలో మంచి సింగర్స్ కూడా వున్నారు. సంగీతం పట్ల ఎంతో అభిరుచి వున్న ఈ తారలు అప్పుడప్పుడు సినిమాలలో తమ గళం వినిపిస్తూ సింగర్స్ గా కూడా అలరిస్తూ వుంటారు. ఇలాంటి వాళ్లల్లో నిత్యా మీనన్ కూడా వుంది.

తెలుగులో 'అలా మొదలైంది' సినిమాతో మొదలెట్టి కథానాయికగా పలు సినిమాలలో నటించి, పేరు తెచ్చుకున్న ఈ మల్లూబేబీ అప్పుడప్పుడు గొంతుకూడా సవరిస్తూ తన గానాన్ని కూడా మనకు వినిపిస్తూ వుంటుంది. అలాగే, తాజాగా ఈ ముద్దుగుమ్మ 'నిన్నిలా నిన్నిలా' అనే తెలుగు సినిమా కోసం ఓ పాట పాడింది.

ప్రముఖ మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తుండగా, నిత్యామీనన్, రీతు వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం కోసం నిత్య పాడిన పాటను బెంగళూరులోని రఘు దీక్షిత్ స్టూడియోలో రికార్డు చేశారు.

ఇదిలావుంచితే, యూకేలో ఉంటున్న సరోద్ విద్వాంసుడు సౌమిక్ దత్తాతో కలసి నిత్యామీనన్ తన తొలి ఇంగ్లిష్ సింగిల్ ను తీసుకురానుంది.  
Nitya Menon
Singer
I.V Sashi

More Telugu News