UAE: పాక్ క్రికెటర్ ఇమేజ్ ని బ్లర్ చేసి... షార్జా స్టేడియం నుంచి పిక్ పంచుకున్న సౌరవ్ గంగూలీ!

Sourav Ganguly Posted a Blur Image of Pak Cricketer in Sharja Stadium
  • రెండు రోజుల్లో మొదలు కానున్న ఐపీఎల్
  • షార్జా స్టేడియాన్ని సందర్శించిన సౌరవ్ గంగూలీ
  • అక్కడి ఫోటోల్లో వెనుక భారీ పాక్ క్రికెటర్ ప్లెక్సీ
మరో రెండు రోజుల్లో దుబాయ్ వేదికగా, ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్న వేళ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఇప్పటికే అక్కడకు చేరుకుని, ఏర్పాట్లను పరిశీలించారు. ఆటగాళ్ల తరువాత గల్ఫ్ చేరుకున్న ఆయన, నిబంధనల ప్రకారం, క్వారంటైన్ ను ముగించుకుని, కరోనా టెస్ట్ తరువాత, తొలిసారిగా షార్జా క్రికెట్ స్టేడియాన్ని సందర్శించారు.

గంగూలీతో పాటు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, మాజీ ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా, సీఓఓ హేమాంగ్ అమిన్ లతో పాటు ఈసీబీ (ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) అధికారులు కూడా ఉన్నారు. అక్కడ తీసిన చిత్రాలను సౌరవ్ గంగూలీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఈ ఫోటోల్లో స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ పాక్ క్రికెటర్ హోర్డింగ్ బ్లర్ లో కనిపిస్తుండటం గమనార్హం.

వాస్తవానికి ఎమిరేట్స్ లో పాక్ క్రికెటర్లకు అమితమైన మద్దతు లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఫ్యాన్స్ ఓ పాక్ క్రికెటర్ భారీ ప్లెక్సీని షార్జా క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. గంగూలీ స్టేడియంలో దిగిన ఫోటోల్లో ఇది స్పష్టంగా తెలుస్తుండగా, ఆ క్రికెటర్ ఎవరన్న విషయం మాత్రం తెలియరావడం లేదు. గంగూలీ పోస్ట్ చేసిన ఈ పిక్ ను మీరూ చూడవచ్చు.
UAE
Dubai
Image
Blur
Sourav Ganguly

More Telugu News