Kamal Haasan: ఇలా సగం మనసుతో అభినందనలు ఎందుకు సార్?.. కమలహాసన్ ను ప్రశ్నించిన టాలీవుడ్ డైరెక్టర్!

Director Madhura Sreedhat Setire on Kamal Half Harted Wishes to Modi
  • ప్రధాని కార్యాలయానికి అభినందనలు చెప్పిన కమల్
  • మోదీ పేరును, హ్యాష్ ట్యాగ్ ను వాడకుండా ట్వీట్
  • సగం మనసుతో కమల్ అభినందనలు చెప్పారన్న మధుర శ్రీధర్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ, నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న వేళ, కమలహాసన్ అభినందనలు తెలుపగా, టాలీవుడ్ దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి, తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కమల్ పై సెటైర్లు వేశారు.

"ఇలా సగం మనసుతో అభినందనలు ఎందుకు సార్. మీరు ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ హాండిల్ 'ఎట్ నరేంద్ర మోదీ. మీరు 'హాష్ ట్యాగ్ నరేంద్ర మోదీ'ని కూడా వాడవచ్చు" అని అన్నారు.

కాగా, అంతకుముందు కమల్ తన విషెస్ తెలుపుతూ, "మన 'పీఎంఓ ఇండియా' ఆయురారోగ్యాలతో, సంతోషంతో, జాతిని ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించే బలంతో ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. ఈ ట్వీట్ లో నరేంద్ర మోదీ పేరును, ఆయన ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ను ప్రస్తావించకుండా, ప్రధాని కార్యాలయానికి అభినందనలు చెప్పడమే విమర్శలకు కారణమైంది.
Kamal Haasan
Madhura Sreedhar Reddy
Birthday
Narendra Modi
Wishes

More Telugu News