Junior NTR: ఎన్టీఆర్ పాటకు మళ్లీ దుమ్మురేపిన జపాన్ జంట.. హల్‌చల్ చేస్తున్న వీడియో!

Japan couple once again danced performance to NTR Song
  • గతంలో పలు పాటలకు స్టెప్పులేసిన జపాన్ జంట
  • ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరవుతున్న వైనం
  • డ్యాన్స్ కోసం పడిన కష్టానికి సంబంధించి మరో వీడియో పోస్ట్
ఎన్టీఆర్ పాటలకు  స్టెప్పులతో ఇరగదీసి తెలుగు అభిమానులకు దగ్గరైన జపాన్ జంట హీరోమునిరు, అశాహి ససాకీ మరోమారు అలరించింది. ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాలోని ‘వయస్సునామీ’ పాటకు అచ్చం ఎన్టీఆర్, హన్సిక వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టు దింపేసింది. యూట్యూబ్‌లో పోస్టు చేసిన ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

గతంలో ఈ జంట సింహాద్రి సినిమాలోని ‘చీమ చీమ’ పాటకు స్టెప్పులేయగా, ఆ తర్వాత ‘గోల..గోల’ పాటతో దుమ్మురేపారు. ఇప్పుడు ‘వయస్సునామీ’ పాటతో అదరగొట్టారు. ఈ పాటతోపాటు డ్యాన్స్ చేసేందుకు తాము పడిన కష్టానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశారు. మీరు కూడా చూసేయండి మరి!

Junior NTR
Japan
Songs
Youtube
Kanti movie
Hansika

More Telugu News