Krishna River: కృష్ణా నది నుంచి మరింత నీరు సముద్రం పాలు!

  • నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు
  • శ్రీశైలం 10 గేట్లు 12 అడుగుల మేరకు ఎత్తివేత
  • ప్రకాశం బ్యారేజ్ నుంచి వందల టీఎంసీలు సముద్రంలోకి
Heavy Flood in River Krishna

కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలో కలుస్తోంది. మరోవైపు కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద వస్తోంది.

 శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, పూర్తిగా నిండిపోయింది. దీంతో 10 గేట్లను 12 అడుగుల మేరకు ఎత్తి, 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారడం, ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు పంపుతుండటంతో వందల టీఎంసీల నీరు సముద్రంలోకి చేరుతోంది. అన్ని జలాశయాల వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి.

More Telugu News