సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సాయిపల్లవికి భారీ పారితోషికం
- మరో సినిమాకి ఓకే చెప్పిన నిఖిల్
- విజయదశమికి 'అల్లుడు అదుర్స్'
* యంగ్ హీరో నిఖిల్ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లోనూ 'స్వామి రారా', 'కేశవ' సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
* సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్' చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది. నభా నటేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేసే యోచన చేస్తున్నారు.