Uttam Kumar Reddy: మనలో ఎవరూ సురక్షితంగా లేరు... బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలు

Uttam Kumar Reddy expresses his grief over the demise of his parliament colleague Balli Durga Prasad
  • కొన్నివారాల కిందట కరోనా బారినపడిన దుర్గాప్రసాద్
  • చెన్నైలో చికిత్స పొందుతుండగా గుండెపోటు
  • దుర్గాప్రసాద్ మృతి కలచివేసిందన్న ఉత్తమ్ కుమార్
తిరుపతి పార్లమెంటు సభ్యుడు, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ మరణం రాజకీయ వర్గాల్లో పార్టీలకు అతీతంగా విషాదం కలిగించింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల తీవ్ర విచారానికి గురయ్యారు. "లోక్ సభలో నా సహచరుడు, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందారన్న వార్త కలచివేస్తోంది. ఈ విషాద ఘడియల్లో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కఠోరమైన వాస్తవం ఏమిటంటే...  కోరలు చాస్తున్న ఈ మహమ్మారి నుంచి మనలో ఏ ఒక్కరూ కూడా సురక్షితంగా లేరన్న విషయం ఈ ఘటనతో వెల్లడైంది" అంటూ ఉత్తమ్ కుమార్ ట్వీట్ చేశారు.
Uttam Kumar Reddy
Balli Durga Prasad
Demise
Corona Virus
Tirupati
YSRCP

More Telugu News