'ఖైదీ' దర్శకుడితో కమలహాసన్ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల!

Wed, Sep 16, 2020, 09:12 PM
kamal hassan film with Lokesh kanagaraj
  • లోకేశ్ కనగరాజ్ 'ఖైదీ' తెలుగులో కూడా హిట్ 
  • విజయ్ తో తీసిన 'మాస్టర్' త్వరలో విడుదల 
  • కమలహాసన్ తో సినిమా ఫస్ట్ లుక్ విడుదల 
  • వచ్చే నెల నుంచి షూటింగ్.. వచ్చే ఏడాది విడుదల  
ఆమధ్య కార్తీ హీరోగా 'ఖైదీ' చిత్రాన్ని రూపొందించి.. అటు తమిళనాట, ఇటు తెలుగునాట భారీ హిట్ కొట్టిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, ఇటీవల విజయ్ హీరోగా 'మాస్టర్' చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

ఈలోగా దర్శకుడు లోకేశ్ తన అభిమాన నటుడు కమలహాసన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. వీరిద్దరి కాంబినేషన్లోనూ రూపొందే భారీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో కూడిన అధికారిక ప్రకటన ఈ రోజు వచ్చింది. ఇది విలక్షణ నటుడు కమలహాసన్ నటించే 232వ చిత్రం.

పైగా ఈ చిత్రాన్ని కమల్ తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తుండడం ఒక విశేషం. యువ సంగీత దర్శకుడు అనిరుథ్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి నిర్వహిస్తారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేలా సినిమా నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారు.  

ఇక ఈ ఫస్ట్ లుక్ ను చాలా గమ్మత్తుగా డిజైన్ చేశారు. 'ఒకానొక సమయంలో అక్కడ ఒక దెయ్యం నివసించేది..' అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్ లో క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని తెలుస్తోంది
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha