Jagan: బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి... కుటుంబ సభ్యులకు ఫోన్ లో పరామర్శ

CM Jagan responds to the sudden demise of Tirupati MP Balli Durgaprasad
  • గుండెపోటుతో మరణించిన తిరుపతి ఎంపీ
  • చెన్నైలో కరోనాకు చికిత్స పొందుతుండగా విషాదం
  • దుర్గాప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటన్న సీఎం జగన్
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ (64) హఠాన్మరణం చెందడం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొన్నివారాల కిందట కరోనా పాజిటివ్ అని తేలడంతో బల్లి దుర్గాప్రసాద్ ను కుటుంబ సభ్యులు చెన్నై తరలించారు. చికిత్స పొందుతుండగా ఆయనకు ఈ సాయంత్రం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంతో శ్రమించినా ఆయన్ను బతికించలేకపోయారు.

ఇక దుర్గాప్రసాద్ మృతిపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆయన దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. దుర్గాప్రసాద్ కుమారుడితో మాట్లాడిన ఆయన తన సంతాపం తెలియజేశారు. ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు. నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో అవిరళ కృషి చేశారని కొనియాడారు. బల్లి దుర్గాప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Jagan
Balli Durga Prasad
MP
Tirupati
YSRCP

More Telugu News