Chandrababu: స్త్రీ, పురుషులను ఒకే గదిలో నిర్బంధించమని ఏ చట్టంలో ఉంది?: చంద్రబాబు

TDP Supremo Chandrababu questions AP Police
  • చిల్లకల్లు పీఎస్ లో ఓ కుటుంబాన్ని నిర్బంధించారన్న చంద్రబాబు
  • చిన్నారిలో ఏ నేరస్తుడు కనిపించాడంటూ ట్వీట్
  • కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా? అంటూ ఆగ్రహం
ఓ వైసీపీ నేత ఫిర్యాదు చేశాడని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను ఏడేళ్ల చిన్నారి సహా చిల్లకల్లు స్టేషన్ కు తెచ్చి నిర్బంధించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసులు తాము అమలు చేయాల్సిన చట్టాలను వదిలేసి వైసీపీ నేతల మాటే చట్టం అన్నట్టుగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఈ సందర్భంగా భూక్యా కుటుంబ సభ్యులు పీఎస్ లో ఓ గదిలో ఉన్న ఫొటోలను చంద్రబాబు పంచుకున్నారు.

ఆ గదిలో ఓ చిన్నారి కూడా ఉండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ చిన్నారిలో మీకు ఏ నేరస్తుడు కనిపించాడు? స్త్రీ, పురుషులను ఒకే గదిలో నిర్బంధించమని ఏ చట్టంలో ఉంది?" అని ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనల పేరిట టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టే మీకు, ఇలా గుంపుగా అందరినీ ఒకేచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించింది? అని నిలదీశారు. కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా? అని మండిపడ్డారు.
Chandrababu
Police
Chillakallu
Bhukya
Krishna District
YSRCP

More Telugu News