Botsa Satyanarayana: హైకోర్టు స్టే ఇవ్వడంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను: బొత్స

  • అమరావతిలో తప్పులు జరిగాయి
  • ఆధారాలతోనే ఏసీబీ కేసులు పెట్టింది
  • దమ్ముంటే విచారణ చేయాలని గతంలో టీడీపీ సవాల్ విసిరింది
I cant comment on HCs order says Botsa

అమరావతి భూములకు సంబంధించి తప్పులు జరిగాయని తాను ముందు నుంచే చెపుతున్నానని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాము చెబితే... ఆధారాలు చూపాలని టీడీపీ వారు అడిగారని తెలిపారు. దీంతో, తాము అమరావతి స్కామ్ పై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, సిట్ కూడా వేశామని చెప్పారు. కుంభకోణానికి సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీకి ఇచ్చామని తెలిపారు. ఆధారాల మేరకే వారు కేసులు పెట్టారని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, వారి తాబేదారులు అందరూ కేసులో ఉన్నారని అన్నారు. దమ్ముంటే విచారణ చేయండని గతంలో వారు సవాల్ విసిరారని... ఇప్పుడు మళ్లీ కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. సిట్ విచారణపై హైకోర్టు ఏ విధంగా స్టే ఇచ్చిందనే దానిపై తాను కామెంట్ చేయబోనని చెప్పారు.

More Telugu News