Ali: సీఎం జగన్ ను కలిసిన సినీ నటుడు అలీ

Tollywood comedian Ali met AP CM Jagan
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అలీ
  • సీఎం జగన్ తో సమావేశం
  • గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన అలీ
టాలీవుడ్ కమెడియన్ అలీ ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అలీ... ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలీ ఓ మొక్కను సీఎం జగన్ కు బహూకరించారు.

అలీ గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు ఎంతో సన్నిహితుడని గుర్తింపు ఉన్న అలీ... జనసేన పార్టీలో చేరతాడని బాగా ప్రచారం జరిగింది. కానీ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. గుంటూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని ఆయన భావించినట్టు తెలిసింది.

అయితే, ఎన్నికల్లో టికెట్ లభించని నేపథ్యంలో, అలీకి ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ పదవి ఇస్తారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అలీ తాజాగా సీఎం జగన్ ను కలవడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
Ali
Jagan
YSRCP
Tollywood
Andhra Pradesh

More Telugu News