GK Reddy: 82 ఏళ్ల వయసులో హీరో విశాల్ తండ్రి ఫిట్ నెస్ చూస్తే 'వావ్' అనాల్సిందే!

Hero Vishal father GK Reddy fitness video gone viral
  • ఇటీవలే కరోనాను జయించిన విశాల్ తండ్రి జీకే రెడ్డి
  • తన ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన జీకే
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో
ప్రముఖ తమిళ హీరో విశాల్ తండ్రి, సీనియర్ ప్రొడ్యూసర్ జీకే రెడ్డి ఇటీవలే కరోనా బారినపడినా, కొన్నిరోజుల్లోనే ఆ మహమ్మారిని జయించారు. 82 ఏళ్ల జీకే రెడ్డి ఇప్పటికీ తనయుడు విశాల్ తో పోటీ పడేలా ఫిట్ గా ఉండడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మధ్యే ఆయన ఓ వీడియోలో తన హెల్త్ సీక్రెట్ తెలిపారు.

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున బయటికి వెళ్లే పరిస్థితి లేదని, అయితే ఇంట్లో ఉండి కూడా ఫిట్ నెస్ పెంపొందించుకోవచ్చని అన్నారు. తేలికపాటి వ్యాయామాలు కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని, క్రమం తప్పకుండా చేస్తే ఏ వయసులో అయినా ఫిట్ గా ఉండొచ్చని స్పష్టం చేశారు. జీకే రెడ్డి పోస్టు చేసిన ఫిట్ నెస్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.
GK Reddy
Fitness
Video
Hero Vishal
Corona Virus

More Telugu News