Transgenders: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం

AP govt to give rice cards to transgenders
షార్ట్స్‌లో చూడండి
సమాజంలో వివక్షకు గురవుతూ, సామాన్య ప్రజానీకానికి దూరంగా బతికే ట్రాన్స్ జెండర్లకు ఏపీలోని జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు ఆకలితో అలమటించకుండా కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రైస్ కార్డులను అందించాలని నిర్ణయించింది. ట్రాన్స్ జెండర్లను గ్రామ వాలంటీర్ల సహాయంతో గుర్తించనున్నారు. గుర్తించబడిన ట్రాన్స్ జెండర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి 10 రోజుల్లో రైసు కార్డును అందిస్తారు. ఈ రైస్ కార్డులు పొందినవారు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారు.
Go Back to Shorts
Transgenders
Jagan
YSRCP

More Telugu News