Indian Railways: 21 నుంచి కొత్తగా మరో 40 రైళ్లు.. సికింద్రాబాద్-ధన్‌పూర్ మధ్య రెండు రైళ్లు!

  • కొత్త రైళ్లలో చాలా వరకు బీహార్ నుంచి రాకపోకలు సాగించేవే
  • ఈ నెల 19 నుంచి రిజర్వేషన్ ప్రారంభం
  • 38 రైళ్లకు హమ్‌సఫర్ రైళ్ల చార్జీల నిర్ణయం
Indian Railway announce another 40 trains

అన్‌లాక్-4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను ప్రకటించి నడుపుతున్న భారతీయ రైల్వే కొత్తగా మరో 40 రైళ్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి ఇవి పట్టాలెక్కనున్నాయి. వీటిలో చాలా వరకు రైళ్లు బీహార్ నుంచి రాకపోకలు సాగించనుండగా, రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్-ధన్‌పూర్ మధ్య తిరగనున్నాయి. ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో-ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు.

More Telugu News